ప్రణాళిక అమలుపై అలసత్వం వద్దు

మంచిర్యాల రూరల్‌: 30 రోజల కార్యాచరణ ప్రణాళికలో పంచాయతీ అధికారులు అలస త్వం వహించద్దని డీపీవో వీర బుచ్చయ్య అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కా ర్యాలయంలో మండల, డివిజన్ల పంచాయతీ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని గ్రా మాల పంచాయతీల్లో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తయిందనీ, ఒక వేళ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తి కాని గ్రామ పంచాయతీల జాబితాను జిల్లా కార్యాలయానికి పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచవర్ష ప్రణాళికను కూడా త యారు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామం లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువత శ్రమదానంలో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డివిజనల్‌ పంచాయ తీ అధికారి ధర్మారాణి, ఫణీందర్‌రావు, ఎంపీఓ లు శంకర్‌, శ్రీపతి బాపూరావు, రవీంద్రనాథ్‌, మేఘమాల, సతీశ్‌, అజ్మత్‌ అలీ, వివేక్‌ రామ్‌, సప్దర్‌అలీ, సతీశ్‌ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.
More