నిమజ్జనానికి ఏర్పాట్లు చేయండి

మంచిర్యాల టౌన్, నమస్తే తెలంగాణ: వినాయ క నిమజ్జనానికి సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆదేశించారు. 12న వినాయక నిమజ్జనం సందర్భంగా మున్సిపల్, పోలీస్ అధికారు లు, ఫైర్, ఆరోగ్య, సింగరేణి అధికారులతో కలిసి గోదావరి నదీ తీరాన్ని శనివారం పరిశీలించారు. విగ్రహాలు తీసుకచ్చే రథాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్లపై గుంతలు లేకుండా చూడాల నీ, విద్యుత్ దీపాలు అంతరాయం లేకుండా వెలిగేలా చూడాలనీ, తాగు నీటికి ప్రజలు ఇబ్బందు లు పడకుండా పలు చోట్ల ఏర్పాటు చేయాలనీ, నది వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలనీ, అందుబాటులో ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు, సింగరేణి రెస్క్యూ టీం ఉండాలనీ, నదిలోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సారి గోదావరి నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉ న్నందున తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాల నీ, ఎలాంటి ప్రమాదాలు లేకుండా నిమజ్జనం వి జయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మాజీ మున్సిపల్ అధ్యక్షురాలు వసుంధర, మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్, నాయకులు తోట తిరుపతి, గాదె సత్యం, పెండ్లి అంజయ్య, సురేశ్ బల్ద వా, కార్కూరి చంద్రమౌళి, దబ్బెట శ్రీనివాస్, సు ధీర్, ఏంఈ శ్రీనివాస్, సానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
More