అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి

మందమర్రి: గ్రామాలు అన్ని రంగాల్లో అ భివృద్ధి సాధించాలంటే ప్రజలు భాగస్వాము లు కావాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి అన్నారు. రెండో జోన్‌లోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లో ప్రతి పౌరుడు పాలు పంచుకోవాలని పిలుపునిచ్చా రు. గ్రామ సభలు నిర్వహించి కమిటీలను ఏ ర్పాటు చేసుకుని ప్రణాళికను అనుసరించి ప నులు ప్రగతి బాట పడతాయన్నారు. ప్రజలం తా కష్టపడితే 30 రోజుల్లో తప్పక మార్పు వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ స్వరాజ్యానికి సీఎం కేసీఆర్ చూపిన మార్గం 30 రోజుల ప్రణాళిక అని పేర్కొన్నా రు. గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు శు భ్రం చేయడంతో పాటు మొక్కలు నాటడం, విద్యుత్ తీగలు సరిచేసి వీధి దీపాలను ఏర్పా టు చేయడం దీంతో పాటు దోమల నివారణ మందు పిచికారీ చేయడం వంటి పనులు చేపట్టాలన్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స ర్పంచులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్త లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని కోరారు. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను స్వచ్ఛమైన వాతావరణలో నిర్వహించుకోవాలన్నారు. జడ్పీ ఉపాధ్యక్షుడు స త్యనారాయణ, మందమర్రి జడ్పీటీసీ సభ్యు డు వేల్పుల రవి, కోఆప్షన్ సభ్యుడు నసీరుద్దీన్, టీఆర్‌ఎస్ నాయకులు నల్లాల ఓదెలు, కొంగల తిరుపతిరెడ్డి, గుర్రం శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచ్ సంజీవరావు, ఈశ్వర్, రాం చందర్ తదితరులు పాల్గొన్నారు.
More