రైతు బంధువు..

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ సర్కారు పెట్టుబడి కోసం అందిస్తున్న రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ యాసంగి లో జిల్లావ్యాప్తంగా 1,30,460 మంది రైతులకు రూ.160.95 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 81, 295 మంది రైతులకు రూ.77.93 కోట్లు చెల్లింపులు చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానాకి ముందే వ్యవ సాయ శాఖ అధికారులు రైతు సమగ్ర సమాచార సర్వేను నిర్వహించి రైతు ల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొం దుపరిచారు.గత రబీ సీజన్‌లో కొంత మంది రైతులకు డబ్బులు చెల్లించ లేదు. దీంతో ఖరీఫ్ సీజన్‌లో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందాలనే ఉద్దేశంతో మండల వ్యవసాయ శాఖ అధికారుల సాయంతో ప్రభుత్వం మరోసారి సర్వే నిర్వహించి రైతుల వివరాలను సేకరించింది. గత రబీ సీజన్ కంటే ఖరీఫ్‌కు మూడు వేల మంది వరకు రైతులు పెరిగారు. అదేవిధంగా బడ్జెట్ కూడా పెరిగింది. ఈసారి ఎలాంటి తప్పులు లేకుండా రైతులకు సకాలంలో డబ్బుల చెల్లిం పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 50 శాతం చెల్లింపులు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారు లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవలే రబీ సీజన్ నివేదికను ప్రభుత్వానికి వ్యవ సాయ శాఖ అధికారులు అందచేశారు. పెరగనున్న సాగు విస్తీర్ణం రైతుబంధు పథకంతో జిల్లా వ్యా ప్తంగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. గత సీజ న్‌తో పోల్చితే దాదాపు 30 వేల ఎకరాల వరకు సాగు పెరుగుతుందని అంటున్నారు. యేటా మాదిరిగానే ప్రభుత్వం ఖరీఫ్‌కు నెల రోజుల ముందుగానే ప్రణాళికలు సిద్ధం చే సింది. ప్రస్తుతం జూన్ నెలలో వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేయడంతో అందుకు తగ్గట్టుగానే ఖరీఫ్ ప్రణా ళికలు అధికారులు సిద్ధం చేశారు. రైతులు కూడా ముందుగానే పంట పొలాలను దుక్కిదున్ని సిద్ధం చేసుకు న్నారు. ఇందుకు అనుగుణంగానే అధికారులు వివిధ పంటల సాగు వివరాలను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 94,260 హెక్టార్లలో వివిధ రకాలైన పంటలు సాగు అవు తాయని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో వరి 27, 483 హెక్టార్లు, మొక్కజొన్న 999 హెక్టార్లు, కందులు 2,796 హెక్టార్లు, పెసర్లు 763 హెక్టార్లు, సోయాబీన్ 433 హెక్టార్లు, పత్తి 54,186 హెక్టార్లు, మిర్చి 548 హెక్టార్లు, పసుపు 127 హెక్టార్లు, ఇతర ఆహార పంటలు 6,734 హెక్టార్లలో సాగు అవుతాయని అంచనా వేశారు. నిర్దేశించిన గడువులోగా డబ్బులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబం ధు ద్వారా ఎంతో మేలు జరుగు తోం ది. ముఖ్యంగా గతంలో పెట్టుబడి కోసం ఎన్నో చోట్ల అప్పులు చేసి ఇబ్బందులు పడేవారమని, తెలం గాణ ప్రభుత్వం వచ్చాక ఆ బాధ తప్పిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుని సం తోషంగా వ్యవసాయం చేసుకుంటు న్నామని వారు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అర్హులైన రైతులు అందరికీ డబ్బులు జమ అవుతాయని అధికారులు చెబు తున్నారు. రైతుబంధు ద్వారా ఎకరా కు రూ. 5 వేల చొప్పున పంట పెట్టు బడి సాయం అందిస్తుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేకుం డా పోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల బాధలు అర్థం చేసుకుని బంధువయ్యాడని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More