కిడ్నాపర్‌గా భావించి ఒకరిపై దాడి

సికింద్రాబాద్ : పిల్లల కిడ్నాపర్‌గా అనుమానించి స్థానికులు ఒకరిపైకి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ నర్సింహాస్వామి కథనం ప్రకారం... వినాయక్‌నగర్ కాలనీలో నివసించే సుధాకర్ ఎలక్ట్రిషన్. ఇతనికి భార్య, నలుగురు పిల్లలు సంతానం. సుధాకర్ మద్యం మత్తులో వినాయక్‌నగర్‌లోని షాపు వద్ద మెట్లపై కూర్చున్నాడు. అయితే అటుగా వెళ్తున్న పాప ఆతనికి దగ్గరలో కూర్చుంది. దీంతో పాపను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని స్థానికులు భావించి సుధాకర్‌పై దాడిచేసి పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసుల విచారణలో సుధాకర్ కిడ్నాపర్ కాదని తేలింది. సుధాకర్‌ను మల్కాజిగిరి తహసీల్దార్ వద్ద బైండోవర్ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
× RELATED రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి