భర్త చనిపోయిన ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని..

మేడిపల్లి: భర్త చనిపోయిన ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని... లోబర్చుకొని మోసం చేసిన వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో నివాసం ఉండే ఓ మహిళ భర్త చనిపోవడంతో ఉద్యోగం కోసం యత్నిస్తున్నది. ఈ క్రమంలో చెంగిచర్ల డిపో కార్యదర్శిగా పని చేస్తున్న వి.సోమసాయిలు సదరు మహిళను పరిచయం చేసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 3లక్షలు తీసుకున్నాడు. ఒక రోజు మత్తు మందు కలిపిన స్వీట్ ఇచ్చి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. మోసపోయానని తెలుసుకుని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Stories: