బై బై పాక్ : మలాలా

ఇస్లామాబాద్: నాలుగు రోజుల పర్యటన ముగించుకున్న నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్‌జాహి ఇవాళ తిరిగి బ్రటన్‌కు పయనమై వెళ్లింది. దాదాపు అయిదేళ్ల తర్వాత ఆమె పాక్‌లో ఆకస్మికంగా పర్యటించింది. 2012లో తాలిబన్లు జరిపిన దాడిలో గాయపడ్డ మలాలా.. ఆ తర్వాత ట్రీట్‌మెంట్ కోసం బ్రిటన్ వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఆమె రాలేదు. అయితే నాలుగు రోజుల క్రితం పేరెంట్స్‌తో పాటు ఇస్లామాబాద్ చేరుకున్న ఆమె స్వాట్ వ్యాలీలో ఉన్న తమ స్వంత ఇంటికి కూడా వెళ్లింది. పీఎంవో ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో మలాలా మాట్లాడింది. తిరిగి స్వదేశానికి రావడంతో తన కల నిజమైనట్లు ఆమె చెప్పింది. బాలిక విద్యను ప్రచారం చేస్తున్నందుకు తాలిబన్లు ఆమెపై దాడి చేసిన విషయం తెలిసిందే.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?