పెళ్లి కూతురికి మహేశ్‌బాబు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్

హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ మహేశ్‌బాబుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వీరాభిమానికి మహేశ్ సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ పంపించి ఆమె ఆశ్చర్యంలో మునిగిపోయేలా చేశాడు. సులేఖ అనే అమ్మాయికి మహేశ్ అంటే చాలా ఇష్టం. మహేశ్‌కి పెద్ద ఫ్యాన్. ఇటీవలే సులేఖ పెళ్లి జరిగింది. తన పెళ్లికి చాలా బహుమతులు వచ్చినప్పటికీ, ఓ స్పెషల్ గిఫ్ట్ చూసి సంతోషం పట్టలేకపోయింది సులేఖ. మహేశ్ తన సైన్‌తోపాటు నమ్రతా సంతకం చేసిన పర్సనల్ గ్రీటింగ్‌ను సులేఖకి పంపించాడు. సులేఖ కుటుంబసభ్యులు పెళ్లిలో సర్‌ఫ్రైజ్ ఇవ్వాలనే ఇలా ప్లాన్ చేశారట. మొత్తానికి తాను ఎంతగానో అభిమానించే హీరో నుంచి గ్రీటింగ్స్ రావడంతో ఎగిరి గంతేసింది సులేఖ. మహేశ్ సర్‌ఫ్రైజ్ గ్రీటింగ్ కార్డు ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
× RELATED రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి