చిన్న సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించిన మ‌హేష్‌

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ధోర‌ణి ఈ మ‌ధ్య కాలంలో చాలా మారిన‌ట్టుగా తెలుస్తుంది. త‌న ఆడియో ఫంక్ష‌న్‌కి స్టార్ హీరోని గెస్ట్‌గా పిలవ‌డం, మ‌రోవైపు వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌తో క‌లిసి స‌ర‌దాగా పార్టీలు జ‌రుపుకోవ‌డం, చిన్న సినిమాలు లేదా పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమా అయితే వెంటనే త‌న ట్విట్ట‌ర్ ద్వారా చిత్ర యూనిట్‌ని ప్ర‌శంసించ‌డం జ‌రుగుతుంది. తాజాగా ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ‘C/o కంచరపాలెం’ చిత్రంపై మ‌హేష్ ప్ర‌శంస‌లు కురిపించాడు. కంచ‌ర‌పాలెం అనే ఊరి నేప‌థ్యంలో తెర‌కెక్కిన రియ‌లిస్టిక్ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

దర్శక ధీరుడు రాజమౌళి, సుకుమార్, శేఖర్ కమ్ముల, కీరవాణి, నాని తదితరులు ‘C/o కంచరపాలెం’ చిత్రంపై ఇప్ప‌టికే ప్ర‌శంస‌లు కురిపించారు. తాజాగా మ‌హేష్ త‌న ట్వీట్‌లో ‘తొలి చిత్రంతోనే అద్భుతమైన సినిమా అందించిన దర్శకుడు వెంకటేష్ మహాకి శుభాకాంక్షలు. ఖచ్చితంగా ఇది దర్శకుడి సినిమా. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకి ప్రాణం. నాకు బాగా నచ్చిన చిత్రం ‘C/o కంచరపాలెం’ అని తెలిపారు మహేష్ బాబు. సురేష్ ప్రొడక్షన్స్‌లో విడుదల చేసిన హీరో రానాని చూస్తుంటే గర్వంగా ఉంది. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆయనకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు మహేష్. ప్ర‌స్తుతం మ‌హేష్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Related Stories: