లోగో లాంచ్ చేసిన మ‌హేష్‌, వంశీ పైడిప‌ల్లి కూతుళ్ళు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో వంశీ పైడిప‌ల్లి క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే మ‌హేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవ‌ల డెహ్రాడూన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ కోసం గోవా వెళ్ల‌నుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అల్ల‌రి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ని మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న విడుద‌ల చేయ‌బోతున్నారు. అంతక‌న్నా ముందు మ‌హేష్ 25వ చిత్ర ఎంబ్ల‌మ్‌ని మ‌హేష్ కూతురు సితార‌, వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్య‌ల చేతుల మీదుగా విడుద‌ల చేయించారు. ఇది మ‌హేష్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని‌దత్, పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5, 2019న విడుద‌ల కానుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నారు. రాజ‌సం అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ప‌రిశీలిస్తున్నారు.

Related Stories: