మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌కు డాక్టరేట్ బిరుదు

హైదరాబాద్: మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌ను గౌరవ డాక్టరేట్ బిరుదు వరించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పాత్ర, సామాజిక సేవా కార్యక్రమాలు, పేద ప్రజలకు విద్య, వైద్యం లాంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ ఆయనను డాక్టరేట్ బిరుదుకు ఎంపిక చేసింది. దీంతో ఆయనకు జులై 29, 2018 ఆదివారం హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న సితార ఆడిటోరియంలో డాక్టరేట్ అవార్డ్‌ను ప్రధానం చేయనున్నట్లు యూనివర్సిటీ ప్రెసిడెంట్ డా. ఏజేసీ శోభన్ బాబు తెలిపారు.

Related Stories: