మళ్లీ విడుదల కానున్న మగధీర..?

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర బాక్సాపీస్ వద్ద రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. భారత సినిమాలకు జపాన్‌లో మంచి మార్కెట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మగధీర సినిమా అప్పట్లో జపాన్‌లో సబ్‌టైటిల్స్‌తో విడుదలైంది. 2009లో వచ్చిన ఈ చిత్రం మరోసారి జపాన్ థియేటర్లలో సందడి చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. మగధీర విడుదలైన సమయంలో ఎస్‌ఎస్ రాజమౌళికి జపాన్‌లో ఉన్న క్రేజ్ తక్కువే. అయితే బాహుబలి విడుదలైన తర్వాత ఒక్కసారిగా జక్కన్న పేరు జపాన్‌తోపాటు వివిధ దేశాల్లో మార్మోగిపోయింది. జపాన్‌లో రాజమౌళి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మగధీర సినిమాను అక్కడ మళ్లీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. అయితే దీనికి సంబంధించి చిత్ర నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ ఆసక్తికర వార్తపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. రాంచరణ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంలో దేవ్‌గిల్, శ్రీహరి కీలక పాత్రల్లో నటించారు.

Related Stories: