కేసు విత్ డ్రా..‘రాబ్తా’కు లైన్ క్లియర్

ముంబై: బాలీవుడ్ స్టార్లు సుశాంత్‌సింగ్ రాజ్‌పుట్, కృతి సనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రాబ్తా మూవీ విడుదలకు లైన్‌క్లియర్ అయింది. ‘రాబ్తా’ రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీరకు కాఫీలా ఉందని వేసిన కేసును చిత్ర నిర్మాత అల్లు అరవింద్ విత్ డ్రా చేసుకున్నారు. రాబ్తా సినిమా అంశంలో వేసిన కేసును గీతా ఆర్ట్స్ బ్యానర్ అధికారికంగా విత్ డ్రా చేసుకుంటుందని అల్లు అరవింద్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజా ప్రకటనతో కొన్ని రోజులుగా ఏర్పడిన వివాదానికి తెరదించుతూ రాబ్తా మూవీ రేపు ప్రేక్షకుల ముందకు రానుంది. రాబ్తా సినిమా మగధీరకు కాఫీ అంటూ అనవసర పుకార్లు సృష్టించారని, రెండు సినిమాలు వేర్వేరు నేపథ్యాలతో తెరకెక్కించారని తమ తరపు న్యాయవాది కోర్టులో వాదనలను వినిపించారని రాబ్తా డైరెక్టర్ దినేశ్ విజన్ తెలిపారు. న్యాయనిపుణుల సమక్షంలో చిత్రాన్ని వీక్షించిన అనంతరం చిత్ర నిర్మాత అల్లు అరవింద్ రాబ్తాపై వేసిన కేసును విత్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Related Stories: