మగధీర రికార్డు వెనుక బాహుబలి 2 పాత్ర

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మగధీర, ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందిన బాహుబలి చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి అమ్ముల పొది నుండి జారిపడ్డ చిత్రాలు అన్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ రెండు ఎపిక్ మూవీస్ గా తెరకెక్కి అద్భుత విజయాలు అందుకున్నాయి. అయితే గత ఏడాది మగధీర చిత్రాన్ని హిందీలోకి డబ్ చేశారు. ఈ చిత్రాన్ని ఓ ప్రబుద్ధుడు బాహుబలి2 పేరుతో లింక్ చేసి ఫిబ్రవరి 12, 2016న యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. బాహుబలి 2 సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కాగా, అప్పటికే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయం తెలుసుకోవాలనుకునే ఆతృత‌ ఫ్యాన్స్ లో పెరిగింది. ఆ స‌మయంలో బాహుబ‌లి 2 పేరుతో ఉన్న లింక్, సినిమా రిలీజ్ కి ముందే ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఫ్యాన్స్ ఎగబడి మరి క్లిక్స్ కొట్టారు. దీంతో హిందీ మగధీర చిత్రం వంద మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు అనువాద చిత్రంగా రికార్డు సాధించింది. ఇలా మగధీర రికార్డుకి బాహుబలి పేరు చాలా కలిసొచ్చింది. అయితే క్లిక్ చేసిన తర్వాత ఆ చిత్రం బాహుబలి 2 కాదని తెలుసుకున్న నెటిజన్స్ డిస్ లైక్స్ తో పాటు దారుణ మైన కామెంట్స్ పెట్టాలనుకున్నారట. ముందస్తు ఈ పరిణామాన్ని ఊహించిన వ్యక్తి కామెంట్స్ డిజేబుల్ చేశాడట. బాహుబ‌లి2 పేరుతో ఉన్న మ‌గ‌ధీన సినిమాకి 58వేల డిస్ లైక్స్ రాగా , లక్షా యాబై వేల లైకులు వచ్చాయి. ఏదేమైన యూ ట్యూబ్ చరిత్రలో ఓ అనువాద చిత్రం ఇంతటి రికార్డుని సాధించడం గొప్ప విశేషమే.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు