మధ్య‌ప్రదేశ్‌లో బీజేపీకి షాక్

భోపాల్: మ‌ధ్యప్ర‌దేశ్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)కి ఊహించ‌ని షాక్. సోష‌ల్ వెల్ఫేర్ బోర్డు చీఫ్ ప‌ద‌వికి సీనియ‌ర్ నాయ‌కురాలు పద్మ శుక్లా గుడ్‌బై చెప్పారు. దాంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆమె తెలిపారు. 30ఏళ్ల నుంచి బీజేపీలో కొనసాగుతున్న శుక్లాకు రాష్ట్ర కేబినెట్ హోదా కూడా ఉంది.త్వ‌రలో కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు తెలిసింది. 1980 నుంచి క్రీయాశీల‌కంగా పార్టీలో ప‌నిచేస్తున్నాను. పార్టీ కోసం చిత్తశుద్ధితో ఎంతో కృషి చేశాను . 2014 ఉపఎన్నికల నుంచి విజయ్ రాఘవ్‌ఘ‌ఢ్ నియోజక వర్గంలోని పార్టీ కార్యకర్తలను తీవ్రంగా నిర్లక్ష్యం చేయడంపై కలత చెందాను. ఆకార‌ణం చేత‌నే పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేస్తున్నాను. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్‌సింగ్‌కు రాసిన లేఖ‌లో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మ‌ధ్యప్ర‌దేశ్ మంత్రి సంజ‌య్ పాఠ‌క్‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని రెండేళ్లుగా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాను. కానీ, అది అంత సులువైన విష‌యం కాద‌ని అర్థం చేసుకున్నాను. అత‌డు నా స‌హ‌చ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేశాడు. అని ఆమె వ్యాఖ్యానించింది.

Related Stories: