మహాకూటమి దొంగల కూటమి

మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జయశంకర్ భూపాలపల్లి: రాజకీయ విలువలను పక్కన పెట్టి అనైతిక పొత్తులు పెట్టుకున్న మహాకూటమి ఒక దొంగల కూటమని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గణపురం మండలంలోని ధర్మారావుపేట, పరుశరాంపల్లి, రవినగర్, సింగరేణి 1000 క్వార్టర్స్, కొండాపూర్, జంగుపల్లి తదితర గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడు వచ్చిపోయే నాయకుల మాటలు నమ్మొద్దని, నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, అభివృద్ధే ఎజెండా పని చేస్తున్న వారిని ఆశీర్వదించాలని వేడుకున్నారు. గత ఎన్నికల్లో ఒక్కసారి ఓటేసి గెలిపిస్తే ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా నాలుగున్నరేళ్లలో భూపాలపల్లిని జిల్లాగా మార్చడంతోపాటు రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసి చూపించానని అన్నారు. అభివృద్ధిని చూసే పార్టీలోకి... గత నాలున్నరేళ్ల సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులయ్యే యువకులు, వృద్ధులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని సిరికొండ అన్నారు. గణపురం మండలం పరిధిలోని పరుశరాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 50మంది యువకులు, వృద్ధులు టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరగా, మధుసూదనాచారి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

Related Stories: