రానాని డైరెక్ట్ చేయ‌నున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు

బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న హీరో రానా ద‌గ్గుబాటి. ఈ ఏడాది రానా ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఒక్క సినిమా కూడా విడుద‌ల కాక‌పోవ‌డం విశేషం. కాని సెట్స్‌పై మాత్రం ఆయ‌న న‌టిస్తున్న ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌కి సంబంధించిన చిత్రాల‌లో రానా నటిస్తుండ‌గా, వ‌చ్చే ఏడాది ఈ మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. అయితే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో రానా ఓ చిత్రం చేయ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఐతే, అనుకోకుండా ఒక రోజు, మ‌న‌మంతా వంటి కుటుంబ క‌థా చిత్రాలు తెర‌కెక్కించిన చంద్ర‌శేఖ‌ర్ యేలేటి .. రానా కోసం ఆస‌క్తిక‌ర సిద్ధం చేసుకున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఆ క‌థ‌కి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని నిర్మాణ సంస్థ భావిస్తుంద‌ట‌. అతి పెద్ద నిర్మాణ సంస్థ అయిత‌న మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు.