శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా ఇన్‌ఫ్లో

అమ్రాబాద్ రూరల్: జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి 25,349 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, 35,026 క్యూసెక్కులను అవుట్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. 882.80 అడుగుల స్థాయిలో చేరుకొని 202.043 టీఎంసీలకు నీటిమట్టం నమోదైంది. తెలంగాణ జెన్‌కో పవర్ హౌజ్ నుంచి 7063 క్యూసెక్కులు నమోదు కాగా ఏపీ పవర్ హౌజ్ నుంచి ఎలాంటి అవుట్‌ఫ్లో నమోదుకాలేదు. కాగా, హంద్రీనివా ప్రాజెక్టు నుంచి 2,363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 24,000 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు