పేదల అభ్యున్నతే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం

రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల
తిరుమలాయపాలెం/ఖమ్మం క్రైం: పేదల అభ్యున్నతే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండ లం హస్నాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రి శనివారం ప్రారంభించి మాట్లాడారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని చేపట్టారన్నారు. రాష్ట్రంలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలోని కరువు ప్రాంతాలకు సాగు నీరందించే లక్ష్యంతో శ్రీ భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు.

హాక్ ఐ యాప్ ప్రారంభించిన తుమ్మల

మంత్రి తుమ్మల ఖమ్మంలోని ప్రకాశ్‌నగర్‌లో గల కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హాక్ ఐ మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హాక్ ఐ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజల ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ లోకేశ్‌కుమార్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.