సర్జికల్ దాడి కోసం చిరుత మూత్రం తీసుకెళ్లారు..

న్యూఢిల్లీ: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ సర్జికల్ దాడులు నిర్వహించి రెండేళ్లు అవుతున్నది. 2016, సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి ఆ దాడి జరిగింది. కానీ ఆ సీక్రెట్ ఆపరేషన్‌కు సంబంధించిన అనేక అంశాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ఓ సీనియర్ ఆఫీసర్ ఇవాళ ఆ ఆపరేషన్‌కు సంబంధించిన ఓ విషయాన్ని వెల్లడించారు. సర్జికల్ దాడికి వెళ్లిన భారతీయ జవాన్లు తమ వెంట చిరుత మూత్రాన్ని కూడా తీసుకువెళ్లారట. లెఫ్టినెంట్ జనరల్ ఆర్‌ఆర్ నింబోకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. కుక్కలు అరవకుండా ఉండేందుకు చిరుత మూత్రాన్ని సైనికులు తమ వెంట తీసుకువెళ్లినట్లు ఆ ఆఫీసర్ చెప్పారు. సాధారణంగా రాత్రి పూట ఊళ్లల్లో కుక్కలు మొరుగుతుంటాయని, కానీ అవి చిరుతలంటే భయపడుతాయని, అందుకే అవి అరవకుండా ఉండేందుకు సైనికులు తమ వెంట చిరుత మూత్రాన్ని తీసుకువెళ్లారని, ఆ మూత్ర వాసన వల్ల కుక్కలు బెదురుతాయని, అవి ముందుకు రావు అని ఆయన అన్నారు. దాదాపు అయిదు గంటల పాటు సర్జికల్ దాడి జరిగింది.

Related Stories: