లెనోవో నుంచి కె5 ప్రొ స్మార్ట్‌ఫోన్

లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ కె5 ప్రొ ను ఈ నెల 25వ తేదీన చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేస్తారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,580 ధరకు లభ్యం కానుండగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.11,640 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.13,760 ధరకు లభ్యం కానున్నాయి.

లెనోవో కె5 ప్రొ ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4050 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Related Stories: