వచ్చేస్తుంది.. 5జీ స్మార్ట్‌ఫోన్..!

కంప్యూటర్స్, మొబైల్ ఉత్పత్తుల తయారీదారు లెనోవో త్వరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ప్రపంచంలోనే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తామే విడుదల చేయనున్నామని లెనోవో వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఈ ఫోన్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది.

లెనోవో విడుదల చేయనున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉండనున్నట్లు సమాచారం. ఇక లెనోవోతోపాటు హువావే, ఒప్పో, వన్ ప్లస్, శాంసంగ్ తదితర కంపెనీలు కూడా త్వరలో 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నాయి. 2019 తృతీయార్థంలో హువావే 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుందని తెలుస్తుండగా, వన్‌ప్లస్, శాంసంగ్‌లు 2019 ద్వితీయార్థంలో తమ తొలి స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని తెలిసింది. అలాగే వివో, నోకియా, షియోమీ, సోనీ, ఎల్‌జీ, జడ్‌టీఈ తదితర కంపెనీలు కూడా ఇప్పటికే క్వాల్‌కామ్ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నాయి. కనుక ఆ కంపెనీలు కూడా 2019లో 5జీ ఫోన్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా 2019 ని మాత్రం 5జీ ఇయర్‌గా చెప్పవచ్చనడంలో అతిశయోక్తి లేదు..!

Related Stories: