శ్రీలంకలోని భారత ఎంబసీకి ఆత్మాహుతి దాడి హెచ్చరిక

కొలంబో: శ్రీలంకలో నేడు వరుస బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ పేలుళ్లకు సంబంధించి దాడులపై ఇంటలిజెన్స్ హెచ్చరికలను పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందరా ఏప్రిల్ 11వ తేదీనే ఉన్నతాధికారులకు చేరవేశారు. దేశంలోని ప్రముఖ చర్చిలపై ఆత్మాహుతి దాడులు జరగనున్నట్లు తెలిపారు. నేషనల్ థౌహెత్ జమాత్(ఎన్‌జేటీ) అనే రాడికల్ ముస్లిం గ్రూప్ దేశంలోని ప్రఖ్యాత చర్చ్‌లు అదేవిధంగా భారత హై కమిషన్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు విదేశీ నిఘా సంస్థ సైతం హెచ్చరించింది.

Related Stories: