ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మందుపాతర పేలింది. ఘటనలో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. సుక్మా జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలాండ్‌మడుగు తాలూకాలో డీఆర్జీ భద్రతా బలగాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో జవాన్లు అనుకోకుండా ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)పై కాలువేయగా విస్ఫోటనం జరిగింది. ఘటనలో ఇద్దరు జవాన్లు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను తోటి జవాన్లు జిల్లాకేంద్రానికి తరలించారు. వీరిలో ఒక జవాను పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Related Stories: