ముందే మొద‌లైన వినాయ‌కుని పండుగ‌

విఘ్నాలు తొల‌గించే వినాయ‌కుని వేడుక‌లు ఓ రోజు ముందు నుండే ప్రారంభించింది దేవ‌దాస్ చిత్ర యూనిట్‌. చిత్రం నుండి ల‌క ల‌క ల‌కుమీక‌ర లంబోద‌ర అనే సాంగ్‌ని కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చిన ఈ పాట‌కి రామ‌జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించ‌గా, అనురాగ్ కుల‌కర్ణి, శ్రీ కృష్ణ క‌లిసి ఆల‌పించారు. ఈ పాటతో త‌మ వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ని ఓ రోజు ముందు నుండే ప్రారంభించింది చిత్ర యూనిట్‌. దేవదాస్ చిత్రం నాగార్జున, నాని కాంబినేష‌న్ లో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంగా తెర‌కెక్కుతుండ‌గా,ఈ మూవీ రీసెంట్‌గా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని శ‌ర‌వేగంగా పూర్తి చేసి సెప్టెంబ‌ర్ 27న మూవీ విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ఈ చిత్రంలో నాని సరసన ఛలో ఫేం రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో దేవ్ అనే పాత్రలో డాన్ గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు . సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటించారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?