ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యేపై మహిళా జర్నలిస్టు కేసు

మహిళా జర్నలిస్టును దుర్భాషలాడినందుకు ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై పోలీసులు కేసు బుక్ చేశారు. ఓటీవలీ చానెల్‌లో చర్చ సందర్బంగా ఆయన తనను బీజేపీ ఏజెంటు అని, పడుపు వృత్తి చేసుకోమని తీవ్రపదజాలంతో దూషించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే భారతి ఈ రోపణలను తోసిపుచ్చారు. మహిలా జర్నలిస్టుపై, ఆమ పనిచేసే చానెల్‌పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తాను కేవలం ఫోన్ ద్వారా చర్చలో పాల్గొన్నానని, కానీ చానెల్ మార్చిన వీడియో చూపిస్తున్నదని ఆయన అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కారప్పొడితో దాడి చేసిన ఘటనపై చర్చ సందర్భంగా ఈ తగాదా చోటుచేసుకుంది.

Related Stories: