లింగ నిర్ధారణ పరీక్షలు.. వైద్యురాలు అరెస్ట్

యాదాద్రి భువనగిరి: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ వైద్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో చోటుచేసుకుంది. స్థానిక ప్రశాంతి ఆస్పత్రిలో షీటీమ్స్ తనిఖీలు నిర్వహించారు. రాచకొండ షీటీమ్స్ అదనపు డీసీపీ షాలిమా ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నిర్ధరణ అయింది. దీంతో వైద్యురాలు ప్రశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
× RELATED రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి