జోరుమీదున్న మీజో నేష‌న‌ల్ ఫ్రంట్‌

ఐజ్వాల్ : మిజోరంలో కాంగ్రెస్‌కు జ‌ల‌క్ త‌గిలింది. ఈశాన్య రాష్ట్రంలో ఆ పార్టీకి ఆన‌వాళ్లు అతి స్వ‌ల్పంగా క‌నిపిస్తున్నాయి. మీజో నేష‌న‌ల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్‌) పార్టీ 23 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న‌ది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కేవ‌లం 12 సీట్ల‌ల్లో మాత్ర‌మే ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. బీజేపీ మ‌రీ దారుణంగా ఉంది. ఆ పార్టీ కేవ‌లం రెండు సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఇత‌రులు మూడు సీట్ల‌లో ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. సీఎం అభ్య‌ర్థి లాల్ త‌న్‌హ‌వ్లా ప్ర‌స్తుతం వెనుకంజ‌లో ఉన్నారు. సెర్‌చిప్‌, చంపాయి స్థానాల నుంచి ఆయ‌న పోటీ చేస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ రెండు స్థానాల్లోనూ ఆయ‌న వెన‌కంజ‌లో ఉన్నారు.

Related Stories: