రేపటి నుంచి గ్రేటర్‌లో కేటీఆర్ రోడ్ షోలు

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఎన్నికల జోష్ నింపేందుకు మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనకు రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ నెల 22 (రేపటి) నుంచి 29వ తేదీ వరకు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున మంత్రి కేటీఆర్ 14 నియోజకవర్గాల్లో రోడ్ షో చేపట్టనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహామే లక్ష్యంగా ఆయా అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయనున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి-హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా రూపొందించే ప్రణాళికలు, రాబోయే మూడేళ్లలోనే 50వేల కోట్ల అభివృద్ధి ప్రణాళికలను ప్రజలను వివరించనున్నారు. ఇక ఈ నెల 25న ఇబ్రహీంపట్నంలో , వచ్చే నెల 3న జరిగే పరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. యువనేత ప్రచారంతో గులాబీ పార్టీ అభ్యర్థులకు మరింత కలిసి రానుందని, వారి గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Stories: