హరికృష్ణ ప్రజలకు ఎంతో సేవ చేశారు: కేటీఆర్

హైదరాబాద్: సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణ కుటుంబసభ్యులను మంత్రి కేటీఆర్ఓదార్చారు. హరికృష్ణ మరణం చాలా బాధాకరమని కేటీఆర్ అన్నారు. రాజకీయ నాయకుడిగా హరికృష్ణ ప్రజలకు ఎంతో సేవ చేశారని చెప్పారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హరికృష్ణ కుటుంబసభ్యులతో మాట్లాడి అంత్యక్రియలపై నిర్ణయం తీసుకున్నం. రేపు సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే అధికారులు మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు.

Related Stories: