బోటు ప్రమాదంపై మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ దిగ్ర్భాంతి

హైదరాబాద్ : ఆంధప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పాపికొండ టూర్ లో జరిగిన బోటు ముంపు ప్రమాదంపై మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబసభ్యులకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి హరీశ్ రావు భరోసానిచ్చారు. లాంఛీ ప్రమాదంపై ఏపీ మంత్రులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకునేలా సమన్వయం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Related Stories:

More