ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ రాజకీయాలకు అనర్హుడు అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు యూఎస్‌లో గిన్నెలు కడిగేవాడని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. వాళ్ల నాన్న చొరవ వల్లే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అమెరికాలో ఉండే ప్రతి ఇండియన్.. వారి పనులు వారే చేసుకుంటారని కౌంటర్ ఇచ్చారు. మీ పప్పులా కాకుండా.. తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపాను అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉత్తమ్‌ను ఉద్దేశించి.. నీ మాదిరిగా ప్రజల సొమ్మును దోచుకోలేదన్నారు. నీ కారులో డబ్బులు తగలబడిన విషయం అందరికీ గుర్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
× RELATED కాంగ్రెస్‌లా కాదు.. వందకు వందశాతం రుణమాఫీ : సీఎం