కుంతియా స్కాంగ్రెస్ జోకర్ : కేటీఆర్

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్‌సీ కుంతియాపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేటీఆర్ అవినీతి వల్లే ఆపిల్, శ్యామ్‌సంగ్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టకుండా తిరిగి వెళ్లిపోయాయని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంతియా ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఏఐసీసీ అలియాస్ ఢిల్లీ సుల్తాన్ అయిన ఈ జెంటిల్‌మేన్ ఏదో చెప్పారని కుంతియాను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్కాంగ్రెస్ జోకర్ మాత్రమే ఇలాంటి చెప్పగలరు. కుంతియాను ఉద్దేశించి.. అజ్ఞానంలోనే ఆనందం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 2016, ఆగస్టులో హైదరాబాద్‌లో ఆపిల్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించిందని, ప్రస్తుతం 3500 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.

Related Stories: