తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కృష్ణార్జునయుద్ధం చిత్రం టీం..

తిరుపతి: తిరుమల శ్రీవారిని కృష్ణార్జునయుద్ధం చిత్ర హీరో నాని, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, చిత్ర టీం దర్శించుకున్నారు. నిన్న తిరుపతిలో జరిగిన కృష్ణార్జునయుద్ధం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చిన చిత్ర టీం ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను వారికి అందజేశారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో హీరో నాని మాట్లాడుతూ.. ఈనెల 12న చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా సినిమా విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Related Stories: