నీటి విడుదల కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: కృష్ణానది యాజమాన్య బోర్డు నది పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన నీటి విడుదలపై ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసినట్లు అధికారలు తెలిపారు. నవంబర్ వరకు సాగు, తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయనున్నారు. సాగు, తాగునీటి అవసరాలకు 52.50 టీఎంసీల నీరు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. నాగార్జునసాగర్ ద్వారా 33 టీఎంసీల నీరు విడుదలకు అనుమతి ఇచ్చారు. ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా 12 టీఎంసీల నీరు విడుదలకు అనుమతి ఇచ్చారు. హైదరాబాద్ తాగునీరు, మిషన్ భగీరథ అవసరాలకు మరో 7.5 టీఎంసీల నీరు విడుదలకు అనుమతి మంజూరు చేశారు.
× RELATED యోగా టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం..