మహాకూటమికి ఓటమి తప్పదు: కొప్పుల ఈశ్వర్

ధర్మపురి : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్టానికి పట్టిన శని అని ప్రభుత్వ తాజామాజీ చీఫ్‌విప్ ఈశ్వర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నియోజకవర్గ స్థాయి యాదవసంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి కృతజ్ఙత సభ గురువారం నిర్వహించగా కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఎందరో బలిదానాలకు కారణమైన కాంగ్రెస్-టీడీపీ మహాకూటమిలో కోదండరాంపొత్తు పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని పార్టీలు కూటమిలుగా ఏర్పడి వచ్చినా ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మట్టికరిపించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని అవినీతి, అక్రమాలే చోటు చేసుకున్నాయనీ, కాంగ్రేస్‌లో ప్రస్తుతం ఉన్నవారందరూ అవనీతికి పాల్పడ్డవాల్లేనని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు, కుతుంత్రాలు పన్నినా టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరన్నారు. కాంగ్రెస్‌తో ఏపార్టీ వెళ్లినా అతి దృతరాష్ట్ర కౌగిలే అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.ఇక్కడ నియోజకవర్గ యాదవులంతా ఈశ్వర్‌కు మద్దతుగా ఏకగీవ్రంగా నిర్ణయం తీసుకున్నారు. గొర్రెల, మేకల రాష్ట్ర ఫెఢరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజన్నయాదవ్ మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వాలూ ఆలోచించని విధంగా యాదవుల గురించి సీఎం కేసీఆర్ ఆలోచించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగించేలా 75శాతం సబ్సిడీపై84లక్షల గొర్రెలను కేసీఆర్ ప్రభుత్వం అందజేసిందన్నారు. గొర్రెల పంపిణీకి ఎస్‌సీడీ ద్వారా రూ.5వేల కోట్లతో ఇప్పటికే గొర్రెలను పంపిణీ చేసిందనీ, మరో రూ.5వేల కోట్లు వెచ్చించేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని గుర్తుచేశారు. ధర్మపురి మండలం దొంతాపూర్‌లో ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించగా గ్రామస్తులు ఘన సాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. గ్రామానికి చెందిన 850 మున్నూరుకాపు కుటుంబాలు, గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాలు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఏకగ్రీవ నిర్ణయం తీసుకొని కాపీలను ఈశ్వర్‌కు అందజేశారు.
× RELATED అయిష్టంగా బరిలోకి...అనూహ్యంగా ఓటమి