ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

హైదరాబాద్: స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట ధీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఇవాళ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈమేరకు నగరంలోని రవీంద్ర భారతిలో కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జోగు రామన్న, మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహరెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేకే, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు. కొండా లక్ష్మన్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ... కొండా లక్ష్మన్ తెలంగాణ కోసం చేసిన పోరాటం గురించి కొనియాడారు. 1969లో ఇందిరాగాంధీ తెలంగాణ ఇవ్వమని చెప్పినపుడు తన మంత్రి పదవిని సైతం తృణపాయంగా వదిలివేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, వరంగల్ నగరంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మేయర్ ఎన్.నరేందర్‌తోపాటు పలువురు నేతుల పాల్గొని దివంగత నేతకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. బాపూజీ తెలంగాణ కోసం చేసిన సేవలు మరువలేనివన్నారు.

Related Stories: