అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

హైదరాబాద్: స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27న బాపూజీ జయంతి ఉత్సవాలను ఘంనగా నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇందిరా హయాంలో 1969లో తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ మొట్ట మొదటి సారిగా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఖ్యాతి గడించాడు. కాగా, కొండా లక్ష్మన్ సెప్టెంబర్ 21, 2012న పరమపదించిన విషయం తెలిసిందే. బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో సెప్టెంబర్ 27, 1915లో జన్మించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1952లో నాన్ ముల్కి, 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

Related Stories: