కుంతియా తెలంగాణకు శనిలా దాపురించాడు..

కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో కమిటీల రూపకల్పనపై రాజగోపాల్‌రెడ్డి బహిరంగ విమర్శలకు దిగారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని వారికి కమిటీలో ప్రాధాన్యత ఇచ్చారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. జైలుకు వెళ్లిన వారికి పదవులా? అని ఆ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. బ్రోకర్లను తీసుకొచ్చి గాంధీభవన్‌లో పెట్టారని, కుంతియా రాష్ట్ర కాంగ్రెస్‌కు శనిలా దాపురించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం కాదు..ప్రజల్లో బలమెంత ఉందో తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలేనని మండిపడ్డారు. కమిటీల రూపకల్పనపై వీహెచ్ హన్మంతరావు, పొంగులేటి కూడా విరుచుకుపడ్డారు.

Related Stories: