తాజ్ లండన్‌లో జెండా ఎగురవేసిన కోహ్లీసేన:వీడియో

లండ‌న్‌: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పంద్రాగస్టు వేడుకులను జరపుకొని ఈ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లు, సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

బుధవారం తాజ్ లండన్ హోటల్ ప్రాంగణంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి, మువ్వన్నెల జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక వీడియో సందేశాన్ని బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అనంతరం ఆటగాళ్లందరూ రెపరెపలాడుతున్న జెండాతో ఫొటోలు దిగారు. వాటిని తమ అభిమానులతో పంచుకున్నారు. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో భారత్ టెస్టు సిరీస్‌లో తలపడుతోన్న విషయం తెలిసిందే.

Here’s wishing everyone a very happy #IndependenceDay 🇮🇳 Jai Hind

A post shared by Ravi Shastri (@ravishastriofficial) on

🇮🇳jai hind🇮🇳

A post shared by Ravindrasinh Jadeja (@royalnavghan) on

× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?