టీ20ల్లో కోహ్లీ రికార్డు

మాంచెస్టర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. టీ20 క్రికెట్‌లో అతివేగంగా 2వేల పరుగులు చేసిన రికార్డును కోహ్లీ అందుకున్నాడు. కేవలం 56 ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 2వేల పరుగులు చేసిన క్రికెటర్లలో మార్టిన్ గప్తిల్, బ్రెండన్ మెకల్లమ్, షోయబ్ మాలిక్‌లు ఉన్నారు. అయితే మెకల్లమ్ 66 ఇన్నింగ్స్‌లో 2వేల రన్స్ చేశాడు. మిగతా ప్లేయర్ల కన్నా కోహ్లీ యావరేజ్ కూడా చాలా మెరుగ్గా ఉంది. ఓల్డ్ ట్రాఫర్డ్ మ్యాచ్‌లో 22 రన్స్ చేసిన కోహ్లీ.. మొత్తం టీ20ల్లో ఇప్పటి వరకు 2012 రన్స్ చేశాడు. టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాల్లో భారత్ నుంచి రోహిత్ శర్మ తర్వాత స్థానంలో ఉన్నారు. అతను ఇప్పటి వరకు 1981 రన్స్ చేశాడు. 2వేల మైలురాయిని అందుకునేందుకు రోహిత్ మరో 19 రన్స్ చేయాల్సి ఉంటుంది. 1900 రన్స్ మార్క్‌ను దాటిన ప్లేయర్లలో పాక్‌కు చెందిన షెహజాద్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో దిల్షాన్, డుమ్నీలు ఉన్నారు.

Related Stories: