రాహుల్ సెంచరీ.. అయినా ఓటమికి చేరువలో టీమిండియా

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఎట్టకేలకు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ సెంచరీతో చెలరేగాడు. అయినా టీమిండియా మాత్రం ఓటమికి మరింత చేరువైంది. చివరి రోజు తొలి సెషన్‌లో మరో రెండు కీలకమైన వికెట్లు కోల్పోయిన భారత్.. లంచ్ సమయానికి 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. రాహుల్ 108, రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు నాలుగో వికెట్‌కు రాహుల్, రహానే కలిసి 118 పరుగులు జోడించారు. ఈ దశలో మ్యాచ్ డ్రా అవుతుందేమో అన్న ఆశ అభిమానుల్లో కలిగింది. అయితే 37 పరుగులు చేసిన రహానే మొయిన్ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన హనుమ విహారి కూడా డకౌటయ్యాడు. దీంతో టీమ్ మళ్లీ కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా రాహుల్ మాత్రం తనదైన ైస్టెల్లో బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ వెళ్లాడు. ఈ క్రమంలో టెస్టుల్లో ఐదో సెంచరీ పూర్తి చేశాడు. చివరి రోజు కనీసం 63 ఓవర్లు ఇంకా మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో డ్రాతో గట్టెక్కడం కూడా కష్టంగానే కనిపిస్తున్నది.

Related Stories: