స‌ల్మాన్ కండ‌ల‌కి నెటిజ‌న్స్ ఫిదా

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఐదు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఫిట్‌గా క‌నిపిస్తుంటాడు. రెగ్యుల‌ర్‌గా జిమ్ చేస్తూ త‌న బాడీని ఫిట్‌గా ఉంచుకునే స‌ల్లూ భాయ్ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్ మొద‌లు పెట్టిన ‘హమ్‌ ఫిట్‌ హైతో ఇండియా ఫిట్’ ఛాలెంజ్‌ని స్వీక‌రించి త‌ను జిమ్ చేస్తున్న వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. కిరెన్‌ రిజిజు (న్యాయవాది, అరుణాచల్‌ ప్రదేశ్ రాజకీయవేత్త) మీ సవాలు స్వీకరించా. నా వీడియో ఇదిగో..’ అని సల్మాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్స్ స‌ల్మాన్ కండ‌ల‌కి ఫిదా అవుతున్నారు. ఈ వ‌య‌స్సులోను ఇంత ఫిట్‌గా ఉండ‌డం మీకు మాత్ర‌మే సాధ్యం. మీకు పెట్టిన పేరు సార్ధ‌కం చేసారు అని నెటిజ‌న్స్ ట్వీట్స్ చేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పని సరి అని మే నెల‌లో కేంద్ర మంత్రి ఈ ఛాలెంజ్ మొద‌లు పెట్టారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్ ప్ర‌ముఖ‌లు కూడా ఛాలెంజ్‌ని స్వీక‌రించారు. లేట్ అయిన లేటెస్ట్‌గా ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన స‌ల్మాన్ త‌న కండ‌ల‌తో మ‌రోసారి అమ్మాయిల హృద‌యాల‌ని గెలుచుకున్నాడు. అయితే త‌న ఛాలెంజ్‌ని స్వీక‌రించినందుకు కిరెన్‌ ట్విటర్‌ వేదికగా స‌ల్మాన్‌కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీరు ఆరోగ్యంగా ఉండాల‌ని ఎంతో మందికి ప్రేర‌ణ క‌లిపించారు అని అన్నారు.

× RELATED కివీస్ కెప్టెన్ ఒంట‌రి పోరాటం