కోల్‌కతాపై టాస్ గెలిచిన పంజాబ్

ఇండోర్: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే దినేశ్ కార్తీక్ నాయకత్వంలోని కోల్‌కతా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ప్రస్తుతం సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన పంజాబ్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 11 మ్యాచ్‌లాడిన కోల్‌కతా 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్ స్థానాన్ని పదిలం చేసుకోవాలని రెండు జట్లు ఉత్సాహంగా ఉన్నాయి.
× RELATED ఎన్టీఆర్‌లో స‌మంత ఏ పాత్ర పోషిస్తుందో తెలుసా ?