కొనసాగుతున్న ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర

హైదరాబాద్: జంట నగరాల్లో వినాయక నిమజ్జనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పురాణ ఇతిహాసాలలోని ప్రధాన ఘట్టాలను ప్రదర్శిస్తూ శోభాయాత్ర కొనసాగుతుంది. ప్రత్యేక ఆకర్ణణలో వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి. నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ చుట్టూ 150 క్రేన్లు ఏర్పాటు చేశారు. గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేసేలా స్టాటిక్, మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ భారీ వినాయకుడిని ఆరో నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నంలోగా నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ప్రస్తుతం టెలిఫోన్ భవన్ వరకు చేరుకుంది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 45 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. అదే ట్యాంక్‌బండ్‌లో 13 వేల విగ్రహాలు నిమజ్జనం పొందాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, పోలీసుశాఖలు ప్రత్యేక కంట్రోల్‌రూం ద్వారా శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

Related Stories: