న్యాయం కోసం వాటికన్‌కు లేఖ

-జోక్యం చేసుకోవాలని కోరిన బాధితురాలు - కేరళ నన్‌పై లైంగికదాడి కేసులో మలుపు
కొట్టాయం/కొచ్చి, సెప్టెంబర్ 11: లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్‌లోని జలంధర్ రోమన్ క్యాథలిక్ చర్చి బిషప్ ఫ్రాంకో ములక్కల్ కేసులో బాధితురాలు వాటికన్ సిటీ జోక్యాన్ని కోరారు. బిషప్ ఫ్రాంకో 2014-2016 మధ్య తనపై 13సార్లు లైంగికదాడికి పాల్పడ్డారని, అసహజ శృంగారం చేశారని బాధితురాలు ఇటీవల కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా కేసు ముందుకుసాగడం లేదని, బిషప్ ఫ్రాంకో తన హోదాను అడ్డం పెట్టుకొని ఆర్థిక, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేసును మూసివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆయనను బిషప్ పదవి నుంచి తొలిగించాలని, అత్యవసరంగా జోక్యం చేసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరుపాలని కోరుతూ వాటికన్ సిటీ ప్రతినిధి గియామ్‌బట్టిస్టా డిక్వాట్ట్రోకు ఈ నెల 8వ తేదీన లేఖ రాశారు. స్థానిక చర్చిలు తనకు న్యాయం చేయడం లేదని ఆమె తెలిపారు.

Related Stories: