కాంగ్రెస్ - టీడీపీ పొత్తు జుగుప్సాకరం : కేసీఆర్

హైదరాబాద్ : కాంగ్రెస్ - టీడీపీ పొత్తు అసహ్యకరం, జుగుప్సాకరం అని కేసీఆర్ అన్నారు. పొద్దున లేస్తే తెలంగాణపై కుట్రలు చేసే చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎట్ల కలుస్తారు అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మళ్లీ ఆంధ్రా పార్టీలకు గులాం కావొద్దన్నారు కేసీఆర్. తమది చక్రం తిప్పే ఫ్రంట్ కాదు.. ప్రజల కోసం పెట్టే ఫ్రంట్ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తాము ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్ అద్భుతంగా నిలబడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. వందశాతం టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ.. సెక్యులర్‌గానే ఉంటది అని తేల్చిచెప్పారు కేసీఆర్. బీజేపీ మాటలకు అంతు లేదు. బీజేపీ నేతలు ఉన్న సీట్లను నిలబెట్టుకుంటేనే చాలా గొప్ప అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు తప్ప తాను ఎవరికీ భయపడను అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
× RELATED ఆహ్లాదం...ఆనందం..ఆరోగ్యం..