కాసేపట్లో కర్నాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 9 గంటల కల్లా తొలిఫలితం వెలువడే అవకాశమున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని 40చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల్ని ఏర్పాటు చేశామని, ఒక్క బెంగుళూరులో ఐదు కేంద్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం కల్లా ఫలితాల వెల్లడి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రపోలీసులతోపాటు కేంద్ర బలగాలనూ స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రాల వద్ద మోహరించారు. ప్రతీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక ఎస్పీ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు అదనపు డీజీపీ కమల్‌పంత్ తెలిపారు. కాగా హెబ్బల్‌లో ఒక పోలింగ్ కేంద్రం, కుష్టగీలో రెండు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీ పోలింగ్ నిర్వహించారు.

Related Stories: