గడప గడపకూ టీఆర్‌ఎస్

జమ్మికుంట: టీఆర్‌ఎస్ అర్బన్‌శాఖ అధ్యక్షుడు టం గుటూరి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్‌లో గడప గడపకూ టీఆర్‌ఎస్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకు లు ఇంటింటికి వెళ్లారు. ప్రజలను కలిశారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను అందించారు. పా ర్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశా రు. ప్రధాన దారుల వెంట టీఆర్‌ఎస్ నినాదాలు చేశారు. తర్వాత జడ్పీ చైర్‌పర్సన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాట్లాడారు. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. జమ్మికుంటలో ఇప్పటి వర కు చేసిన అభివృద్ధిని వివరించారు. పార్టీమండలాధ్యక్షుడు పింగిళి రమేశ్, నాయకులు మల్లయ్య, శ్రీనివాస్, గణపతి, కోటి, రాజు, కిషన్‌రెడ్డి, శివశంకర్, సుధాకర్, తిరుపతిరావు, నవీన్, అక్బర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
More