నేడే వెట్న్

మంథని, నమస్తే తెలంగాణ/మంథని రూరల్: రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు కీలక పరీక్షలకు రంగం సిద్ధమైం ది. మేడిగడ్డ నుంచి వస్తున్న జలాలను అన్నారం పంప్‌హౌస్ ద్వారా సుందిళ్ల బ్యారేజీలో ఎత్తిపోసే క్రమంలో మోటర్ల పరీక్షలకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఫోర్‌బేలో కనీస మట్టానికి నీరు చేరడంతో ముందుగా నేడు మొదటి పంపును పరీక్షించి, తర్వాత దఫాదఫాలుగా చేపట్టేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కనీస మట్టానికి చేరవలో నీరు.. మేడిగడ్డను నింపుకొని కాసిపేట ద్వారా ఇప్పటికే బ్యారేజీలోకి ఐదు టీఎంసీలకు పైగా నీరు చేరింది. బ్యారేజీ జలకళను సంతరించుకోవడంతోపాటు బ్యాక్ వాటర్‌గా వస్తున్న గోదారి ఎదురెక్కుతూ మంథని మండలం కాసిపేటలోని అన్నారం పంప్‌హౌస్‌లోకి చేరగా, ఇక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం పంప్‌హౌస్‌లో మినిమం డ్రాట్ లెవల్ 116.500 మీటర్లకు నీరు చేరువలో ఉండడంతో ముందుగా పంప్‌హౌస్‌లోని మోటర్లను పరీక్షించేందుకు సిద్ధమయ్యారు. నేడే వెట్న్ నీటి ఎత్తిపోతలకుగాను అన్నారం పంప్‌హౌస్‌లో మొత్తం ఎనిమిది మోటర్లు ఏర్పాటు చేయగా, ఇందులో ఇప్పటికే నాలుగింటిని రెడీగా ఉంచారు. అయితే ఎదురెక్కి వచ్చిన గోదారి జలాలు అన్నారం పంప్‌హౌస్‌లో కనీస మట్టానికి చేరవలోకి రావడంతో ఎత్తిపోతలకు ముందుగా మోటర్ల వెట్న్(్రనీటిని ఎత్తిపోసే విధానాన్ని పరీక్షించే ప్రక్రియ) చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కాళేశ్వరం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, విదేశీ, స్థానిక ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో శుక్రవారం మొదటి మోటర్‌ను పరీక్షించేందుకు ముహూర్తం ఖరారుచేశారు. మొదట ఒక్క మోటార్‌ను రన్ చేసి ఆ తర్వాత ఇక్కడికి చేరుతున్న నీటిని బట్టి క్రమంగా మోటార్ల సంఖ్యను పెంచే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోటర్లకు ఆటోమెటిక్ సిస్టం.. కన్నెపల్లి పంపు హౌస్ ద్వారా అనుభవం పొం దిన ఇంజినీర్లు అన్నారం పంపుహౌస్‌ను పూర్తిగా ఆటోమేటిక్ రిమోట్ సిస్టం ద్వారా పంపులను ఆ పరేటింగ్ చేసే విధానాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తు తం కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లను నిలిపివేసి రిమోట్ సిస్టం ద్వారా తిరిగి మోటార్లు ఎత్తుకునే విధంగా నూతన పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నా రు. అయితే అక్కడిలా మోటర్లు నడిచాక మళ్లీ ఆ పివేసి చేసేకంటే ముందుగా వెట్న్ నుంచే అమ లు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సీ ఎం కేసీఆర్ సూచన మేరకు నీటి పారుదల నిపుణులు, విదేశీ నిపుణులు, ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, నీటి పారుదల సలహాదారు పెంటారెడ్డి ఆ ధ్వర్యంలో అన్నారం పంప్‌హౌస్‌లో అనేక రకాల పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేశారు.
More